నిర్మల్చైన్గేట్: నిర్మల్ వ్యవసాయ మార్కెట్ యార్డు భూమి ఆక్రమణకు గురవుతోందనే సమాచారంతో బీజేపీ నాయకులు, కిసాన్ మోర్చా ప్రతి నిధులు, రైతులు మార్కెట్ యార్డును గురువారం సందర్శించారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి అండతో మార్కెట్ యార్డుకు సంబంధించిన విలువైన భూమిని కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఆ స్థలంలో ఒక ప్రైవేటు వ్యక్తి నిర్మాణ పనులు చేపడుతూ, మార్కెట్ యార్డుకు చెందిన ప్రహరీ, స్లాబ్ను కూల్చివేశాడని మండిపడ్డారు. ఈ ఆక్రమణ వ్యవహారంపై మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేశామని చెబుతున్నా, కబ్జాదారులపై ప్రత్యక్ష చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు. ఇందులో బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామనాథ్, తక్కల రమణారెడ్డి, దొడ్డికింది ముత్యంరెడ్డి, మేడిసేమ్మ రాజు, సాదం అరవింద్, సామ రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపె విలాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దొడ్డికింది నిరంజన్రెడ్డి, నిర్మల్ పట్టణ అధ్యక్షుడు సుంకరి సాయిల, కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు.


