ఎవరికీ పట్టరా? | - | Sakshi
Sakshi News home page

ఎవరికీ పట్టరా?

Oct 16 2026 10:28 AM | Updated on Oct 16 2026 10:28 AM

● హక్కుల సాధనకు సమ్మె బాట ● మూడు రోజులుగా వినూత్న నిరసనలు ● జిల్లాలో వైద్య సేవలపై ప్రభావం

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి ఉద్యోగికి క్యాడర్‌ ఫిక్సేషన్‌ అమలు చేసి 100 శాతం గ్రాస్‌ జీతం చెల్లించాలి.

ఇతర సేవా ఏజెన్సీలను రద్దు చేసి, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరినీ స్టేట్‌ హెల్త్‌ సొసైటీ (ఎన్‌హెచ్‌ఎస్‌) పరిధిలోకి తెచ్చి నేరుగా వేతనాలు అందించాలి.

2002 నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు 5 శాతం ఇంక్రిమెంట్‌, 8 శాతం లాయల్టీ బోనస్‌ మంజూరు చేయాలి.

మహిళా సిబ్బందికి క్యాడర్‌తో సంబంధం లేకుండా 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి.

ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా లేదా బీమాతోపాటు కుటుంబంలో అర్హత ఉన్న ఒకరికి ఉద్యోగం కల్పించాలి.

ప్రతి ఉద్యోగికి ఉద్యోగ భద్రతతోపాటు ఈహెచ్‌ఎస్‌ లేదా ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలి.

పెండింగ్‌లో ఉన్న తొమ్మిది నెలల పీఆర్‌సీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి.

ఎన్‌హెచ్‌ఎంలు

నిర్మల్‌చైన్‌గేట్‌: జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద వైద్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. వైద్యుల నుంచి అటెండర్ల వరకు సుమారు 78 కేటగిరీల ఉద్యోగులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం తదితర తొమ్మిది ప్రధాన డిమాండ్లతో జేఏసీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన గురువారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. ఉద్యోగులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.

వైద్య సేవలపై తీవ్ర ప్రభావం

జిల్లా వ్యాప్తంగా 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), సబ్‌సెంటర్లు, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, కమ్యూనిటీ, ఏరియా ఆస్పత్రుల్లో మొత్తం 289 మంది ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. రెగ్యులర్‌ సిబ్బందితో సమానంగా పనిచేస్తున్నా వేతనాలు తక్కువగా ఉన్నాయని వా రు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా పీహెచ్‌సీలు, ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలు వీరిపైనే ఆధారపడి నడుస్తున్నాయి. పాఠశాలల్లో పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించే ఆర్బీఎస్‌కే సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొనడంతో ఆ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.

గ్రామస్థాయి నుంచి కీలక పాత్ర

గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు ప్రభుత్వ ఆరోగ్య సేవలు ప్రజలకు అందించడంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరి లో వైద్యులు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, స్టా ఫ్‌ న ర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ప్రో గ్రాం మేనేజ్‌మెంట్‌ సిబ్బంది, వివిధ క్యాడర్ల ఉద్యోగులు ఉన్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుండా జాప్యం చేస్తుందని జేఏసీ నాయకులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు.

ప్రధాన డిమాండ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement