నిర్మల్ఖిల్లా: వేల మైళ్ల దూరంలో ఉన్నా.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మ రువకుండా ప్రవాస తెలంగాణీయులు బతుక మ్మ సంబరాలను వైభవంగా నిర్వహించారు. అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటా నగరంలో గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ(గేట్స్) ఆధ్వర్యంలో బుధవారం రాత్రి అట్ల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఉయ్యాల ఆటపాటలు మార్మోగాయి. నిర్మల్ కు చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు, కవి, రచయి త, ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కావేరి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ అప్పాల చక్రధారి వేడుకల్లో పా ల్గొన్నారు. కార్యక్రమంలో గేట్స్ అధ్యక్షుడు రమణ గండ్ర, చైర్పర్సన్ జ్యోత్స్న, జిల్లాకు చెందిన ఎన్నారై, జానపద కళాకారుడు పన్నెల జనార్దన్, చందు, జాప కృష్ణమోహన్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


