ఖానాపూర్: అటవీశాఖ అధికారులు ఆదివాసీ లపై దాడులు చేస్తున్నారని, వారి హక్కులకు భంగం కలిగిస్తున్నారని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నంది రామయ్య ఆరోపించారు. పెంబి మండలం తాటిగూడ గ్రామానికి చెందిన ఆదివాసీ మేకల కాపరి ఆత్రం శేషురావును డిప్యూటీ రేంజర్ చితకబాదాడు. ప్రస్తుతం బాధితుడు ఖానా పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శేషురావును నంది రామయ్య గురువారం పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నంది రామయ్య మాట్లాడుతూ.. కవ్వాల్ టైగర్ జోన్ పేరుతో అటవీశాఖ అధికారులు ఆదివాసీలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పెంబి డిప్యూటీ రేంజర్ రాథోడ్ ప్రతాప్ నాయక్‌ను సస్పెండ్ చేయాలని, బాధితుడికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అటవీశాఖ అధికారుల వ్యవహారశైలికి వ్యతిరేకంగా వామపక్షాలు, ప్రజాసంఘాలతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
డీఆర్వోపై చర్య తీసుకోవాలి
కడెం: పెంబి మండలం లోతర్యతాటిగూడ గ్రామానికి చెందిన ఆత్రం శేషరావుపై దాడి చేసిన డీఆర్వో(డిప్యూటీ రేంజర్)ప్రతాప్నాయక్పై చర్యలు తీసుకోవాలని రాజ్‌గోండ్ సేవాసమితి జిల్లా అధ్యక్షుడు ఆత్రం రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఖానాపూర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న శేషరావును గురువారం పరామర్శించి మాట్లాడారు. డీఆర్వో విధుల నుంచి తొలగించకుంటే ఆదివాసీ సంఘలతో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాజ్‌గోండ్ సేవాసమితి గౌరవ అధ్యక్షుడు ఆత్రం భగవంత్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్రం భీంరావు, ఉపాధ్యాక్షుడు మర్సుకోల భీంరావు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


