న్యూస్‌రీల్
నిర్మల్
మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై జిల్లా యువత, వలస కార్మికులు అప్రమత్తంగా ఉండాలని ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ దేవులపల్లి ఆనంద్ సూచించారు.
నిర్మల్‌చైన్‌గేట్: గత డిసెంబర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసిన అనేక మంది అభ్యర్థులకు ఇప్పటికీ డిపాజిట్ రుసుం తిరిగి చెల్లించలేదు. చాలా మంది నామినేషన్లు సమర్పించి పోటీలో నిలిచారు. కొందరు గెలుపొందగా, మరికొందరు స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. కొంత మంది డిపాజిట్ కోల్పోయారు. గెలిచినవారు, అలాగే ఓడినప్పటికీ డిపాజిట్ దక్కించుకున్నవారు ఎన్నికల ఖర్చు లెక్కలు సమర్పించకపోవడంతో అధికారులు రుసుం తిరిగి ఇవ్వడం లేదని తెలుస్తోంది.
నిధులు సకాలంలో రాకపోవడం
2025 డిసెంబర్‌లో జిల్లాలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వచ్చి దాదాపు పది నెలలు గడిచినా, డిపాజిట్ కోల్పోయినవారిని మినహాయించి మిగతా అందరికీ రుసుం చెల్లించాల్సి ఉంది. అయినా ఆ నగదు అధికారుల వద్దనే ఉంది. కొందరు అడిగితే ఎన్నికల ఖర్చులో చూపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ప్రతి మండలానికి ఎన్నికల ఖర్చు కింద రూ.5 లక్షల వరకు ప్రభుత్వం కేటాయించాలి. ఆ నిధులు ఇంకా రాకపోవడంతో డిపాజిట్ డబ్బులను అధికా రులు వాడుకున్నట్లు సమాచారం. ఈ మొత్తం రూ.లక్షల్లో ఉందని చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి డిపాజిట్ తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అడిగినవారికే ఇస్తున్నారు..
ఎన్నికల నిబంధనల ప్రకారం సర్పంచ్‌గా పోటీ చేసిన జనరల్ అభ్యర్థులు రూ.2 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,000 డిపాజిట్ చేశారు. వార్డు సభ్యులుగా పోటీ చేసిన జనరల్ అభ్యర్థులు రూ.500, రిజర్వుడ్ అభ్యర్థులు రూ.250 చెల్లించా రు. జిల్లా వ్యాప్తంగా లెక్కిస్తే ఈ మొత్తం రూ.40 లక్షల నుంచి రూ.65 లక్షల వరకు ఉంటుంది. ఈ నిధులు ఎంపీడీవోల పరిధిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఖర్చు లెక్కలు సమర్పించి అడిగినవారికి మాత్రమే అధికారులు డిపాజిట్ తిరిగి ఇస్తున్నారు.
వివరాలు:
మొత్తం సర్పంచ్ స్థానాలు 400
ఎన్నిక జరిగిన స్థానాలు 399
వార్డు సభ్యుల స్థానాలు 3,368
నామినేషన్ రాని వార్డు స్థానాలు 14
మొదటి విడత సర్పంచ్ పోటీ స్థానాలు 136
పోటీపడిన అభ్యర్థులు 470
మొదటి విడత వార్డు స్థానాలు 1,072
పోటీపడిన అభ్యర్థులు 1,842
రెండో విడత సర్పంచ్ పోటీ స్థానాలు 131
పోటీపడిన అభ్యర్థులు 424
రెండో విడత వార్డు స్థానాలు 1,170
పోటీపడిన అభ్యర్థులు 2,136
మూడో విడత సర్పంచ్ పోటీ స్థానాలు 133
పోటీపడిన అభ్యర్థులు 386
మూడో విడత వార్డు స్థానాలు 1126
పోటీపడిన అభ్యర్థులు 2,152
వేల మంది పోటీ
ఏకగ్రీవాలు తప్ప మిగతా స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ స్థానాలకు సుమారు 1,280 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 6,130 మంది పోటీ చేశారు. జమ అయిన నగదులో సగం వరకు రీఫండబుల్ కేటగిరీలోకి వస్తుంది. పోలైన ఓట్లలో కనీసం ఆరో వంతు సాధించినవారికి పూర్తి మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్ కోల్పోయినవారికి మాత్రం ఇవ్వరు. కొందరు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. తక్కువ మొత్తాలే కాబట్టి కొందరు వదిలేసుకున్నట్లు కనిపిస్తోంది. అధికారులు కూడా స్పష్టమైన లెక్కలు ఇవ్వడం లేదు.


