రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలి

Oct 1 2026 4:46 AM | Updated on Oct 1 2026 4:46 AM

● అదనపు కలెక్టర్‌ రమేశ్‌రాథోడ్‌

సారంగపూర్‌: భూముల రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) రమేశ్‌రాథోడ్‌ సూచించారు. మండలంలోని కౌట్ల(బి) గ్రామంలో జరుగుతున్న రీసర్వేను బుధవారం పరిశీలించారు. సర్వే వివరాలను సర్వేయర్‌ యోహాన్‌ను అడిగి తెలుసుకున్నారు. రీసర్వే పారదర్శకంగా చేపట్టాలని, భూములకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేకుండా నమోదు చేయాలని తెలిపారు. రైతుల సందేహాలు నివృత్తి చేస్తూ రీసర్వే ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ సహాయ సంచాలకులు విఠల్‌, తహసీల్దార్‌ విజయ్‌కాంత్‌రావు, నాయబ్‌ తహసీల్దార్‌ రాంచందర్‌, ఎంఆర్‌ఐ నర్సయ్య, జీపీవో ప్రవళ్లిక, సర్పంచ్‌ అజయ్‌, ఉపసర్పంచ్‌ శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు.

తహసీల్దార్‌ కార్యాలయం పరిశీలన

సారంగాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) రమేశ్‌రాథోడ్‌ బుధవారం సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. కార్యాలయంలో జరుగుతున్న పనులను సమీక్షించారు. సర్‌ ప్రక్రియను వేగంగా పూర్తి చేయడంతోపాటు భూభారతి ఫైళ్లు, ప్రజావాణి ఫైళ్లు పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలని తెలిపారు. మీసేవ కేంద్రాల నుంచి వచ్చే సర్టిఫికెట్లు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం చించోలి(బి) గ్రామంలోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ విజయ్‌కాంత్‌రావు, ఎంపీడీవో లక్ష్మీకాంత్‌రావు, నాయబ్‌ తహసీల్దార్‌ రాంచందర్‌, కార్యాలయం సిబ్బంది, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement