ప్రత్యేక అవసరాలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక అవసరాలపై అవగాహన

Oct 1 2026 4:46 AM | Updated on Oct 1 2026 4:46 AM

నిర్మల్‌ రూరల్‌: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్ర త్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల తల్లిదండ్రుల కు ఆయా అంశాలపై జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కల్పించారు. సీనియర్‌ సివి ల్‌ జడ్జి పి.రవీందర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల హక్కులు, వారికి చట్టం కల్పించిన వసతుల గురించి వివరించారు. వారికి అన్యాయం జరిగితే వెంటనే జిల్లా న్యాయ సేవా సదస్సును ఉచితంగా సంప్రదించవచ్చని సూచించారు. వారికి తగిన న్యాయ సహా యం అందిస్తామన్నారు. అదనపు కలెక్టర్‌ రమేశ్‌రా థోడ్‌ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పిల్లల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. తల్లిదండ్రులు వాటిని సద్వినియోగం చేసుకోవా లని సూచించారు. విద్యార్థుల్లోని ప్రత్యేక ప్రతిభను గుర్తించి, సరైన చదువు అందించి, వారి భవిష్యత్తు కోసం కృషి చేయాలన్నారు. డాక్టర్‌ జగదీశ్‌ మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాల పిల్లల లక్షణాలు, వారి కి వైకల్యం రావడానికి కారణాలు, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. డీఈవో భోజన్న మాట్లాడు తూ.. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు, భవి త సెంటర్ల వినియోగం, సహాయక పరికరాలు, స్కాలర్షిప్‌ల గురించి తల్లిదండ్రులకు వివరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పని చేస్తేనే.. సమగ్ర విద్య లక్ష్యం నెరవేరుతుందన్నారు. విలీన విద్య సమన్వయకర్త ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాల గురించి, వారికి అందులో కల్పిస్తున్న విద్య అవకాశాలు, ప్రోత్సాహకాలు, థెరపీ సేవలు, ఉపకరణాలపై వివరించారు. పిల్లల తల్లిదండ్రులకు ఇంక్లూజివ్‌ ఎడ్యుకేషన్‌, ప్రభుత్వ పథకాలు హక్కులపై అవగాహన కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement