భైంసాటౌన్: మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్‌గా జాదవ్ సంతోష్‌కుమార్ నియమితులయ్యారు. బుధవారం బాధ్యతలు స్వీ కరించారు. కమిషనర్‌గాఉన్న ఎం.లింగయ్య నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కౌన్సిల్ సభ్యులు ఆయన్ను సీడీఎంఏకు సరెండర్ చేయాలని సమావేశంలో తీర్మానించారు. దీంతో ఆయన ఈనెల 23 నుంచి 26 వరకు సెలవులో ఉన్నారు. తర్వాత మరో 15 రోజులు సెలవు పెట్టినట్లు తెలిసింది. దీంతో డీఈఈ సంతోష్‌కుమార్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
సకాలంలో సిలబస్
పూర్తి చేయాలి
భైంసాటౌన్: విద్యార్థులు కళాశాలకు సక్రమంగా హాజరయ్యేలా చూడడంతోపాటు సకాలంలో సిలబస్ పూర్తి చేయాలని డీఐఈవో పరశురాం సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్ శివరంజని, అధ్యాపక బృందంతో సమావేశమై ఇప్పటివరకు పూర్తయిన సిలబస్, విద్యార్థులు, అధ్యాపకుల హాజరు, తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. అర్ధవార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల సన్నద్ధతపై సూచనలు చేశారు.


