నర్సాపూర్ (జి): పేదరికా న్ని జయించి ఐఐటీలో సీటు సాధించింది మండలంలోని చాక్ పల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని బ్యాగరి కావేరి. బ్యాగరి సాగర–భోజన్న (చిట్టిబాబు) దంపతుల కూతురు కావేరి చిన్నతనం నుంచి చదువులో చురుకుగా ఉండడంతో తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించారు. తల్లి సాగర బీడీ కార్మికురాలు కా గా తండ్రి భోజన్న ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. జూన్‌లో వెలువడిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలలో ఎస్సీ కేటగిరీలో 637వ ర్యాంకు సాధించింది. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ ఐఐటీ కాలేజీలో సీటు సాధించి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ డిగ్రీ చదువుతోంది.
కూతుళ్లు.. భారం అనుకోలేదు..!


