ఆడబిడ్డకూ.. అడ్డు లేదు.. | - | Sakshi
Sakshi News home page

ఆడబిడ్డకూ.. అడ్డు లేదు..

Sep 27 2026 12:10 AM | Updated on Sep 27 2026 12:10 AM

నిర్మల్‌: ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే చాలు.. నొసలి చిట్లించేవారు. ‘ఎందుకు పుట్టిందిరా.. ఎట్లా పెంచాలిరా..’ అన్న ఫీలింగ్‌. పుట్టినబిడ్డకూ ఊహ తెలియకముందు నుంచే ఎన్నో ఆంక్షలు. కనీసం ఇంటి గడప దాటాలన్నా అనుమతి తీసుకోవాల్సిందే. ఉద్యోగం చేయడం అటుంచి, తాను ఉన్నతవిద్యను చదవడానికే ఎన్నో అభ్యంతరాలు. బయట ప్రపంచంలో అడుగుపెట్టే అవకాశమే తక్కువ. కానీ.. కాలం మారింది. తల్లిదండ్రులు, సమాజం ఆలోచనలూ మారాయి. ‘ఆడపిల్ల’ అనే తేడా లేకుండా తనూ ఓ ‘బిడ్డ’గా మగపిల్లలతో సమానం చూస్తున్న తల్లిదండ్రుల సంఖ్య పెరిగింది. ఫలితంగా నేటి అమ్మాయిలూ తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేరుస్తున్నారు.

‘ఈరోజుల్లో ఆడబిడ్డ, మగబిడ్డ ఎవరైనా ఒకటే. మంచి చదువు, ఉద్యోగంతోనే వారికి విలువ. కార్పొరేట్‌ కంపెనీల నుంచి పెళ్లి సంబంధాల దాకా ఆడ,మగ అనే తేడాలు చూడటం లేదు. వారి చదువు, హోదా, సంస్కారాన్నే గుర్తిస్తున్నారు. మాకు కూడా ఒక్క ఆడబిడ్డనే..’అని చెబుతున్నారు నిర్మల్‌కు చెందిన వైద్యదంపతులు చిటికేశి రంజిత, సంతోష్‌రాజ్‌. తమ బిడ్డ ఇషితారాజ్‌ ఎంత చదివితే అంత చదివిస్తామంటున్నారు. ప్రస్తుతం తాను తల్లిదండ్రుల బాటలోనే ఎంబీబీఎస్‌ చదువుతోంది. తమ బిడ్డకు కేవలం గైడ్‌ చేస్తున్నామే తప్పా.. ఇది చదువు, అది చేయు అని చెప్పడం లేదంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement