కష్టాలను అధిగమించి.. | - | Sakshi
Sakshi News home page

కష్టాలను అధిగమించి..

Sep 27 2026 12:10 AM | Updated on Sep 27 2026 12:10 AM

● పేదరికం చదువుకు ఆటంకం కాదని నిరూపిస్తూ.. ● కష్టాలను అధిగమించి.. బంగారు భవిష్యత్‌కు బాటలు

● పేదరికం చదువుకు ఆటంకం కాదని నిరూపిస్తూ.. ● కష్టాలను అధిగమించి.. బంగారు భవిష్యత్‌కు బాటలు

భైంసా/లోకేశ్వరం: లోకేశ్వరం మండ ల కేంద్రానికి చెందిన ముత్తవ్వ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కో ల్పోయింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్ర మే. అయినా చదువును మా త్రం వదల్లేదు. కష్టాలను అధిగమిస్తూ పట్టుదలతో చదివి నిర్మల్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు సాధించింది. ముత్తవ్వకు రెండేళ్ల వయసున్నప్పుడే తండ్రి దశరథ్‌ అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటికి ఆమె తమ్ముడు లక్ష్మణ్‌కు ఏడాది వయసు. తల్లి వసంత కూలీ పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను కష్టపడి పెంచింది. అయితే 2019లో అనారోగ్యంతో తల్లి కూడా మృతి చెందింది. అప్పటికి ముత్తవ్వ ఆరో తరగతి, లక్ష్మణ్‌ మూడో తరగతి చదువుతున్నారు. దీంతో చిన్న వయసులోనే ఇద్దరూ తల్లిదండ్రులను కోల్పోయారు.

చదువే భవిష్యత్తును మార్చుతుందని..

తల్లిదండ్రులు దూరమైనా చదువును మాత్రం ముత్తవ్వ వదల్లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా చదువే తన భవిష్యత్తును మార్చగలదని నమ్మింది. గురుకుల విద్యలో కొనసాగుతూ చదువుపై శ్రద్ధ పెట్టింది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో నీట్‌కు సిద్ధమైంది. నీట్‌–2026లో 406 మార్కులు సాధించి వైద్య విద్యకు అర్హత సాధించింది. తాజాగా నిర్మల్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ సీటు దక్కించుకుంది.

పేదలకు సేవ చేయడమే లక్ష్యం

జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా చదువును మాత్రం వదలలేదు. వైద్యురాలిగా మారి పేదలకు సేవ చేయాలన్నదే నా కల. నా పరిస్థితులు నాకు అడ్డంకి కాకుండా లక్ష్యాన్ని చేరుకునేందుకు మరింత పట్టుదలగా చదివాను.

– తోకల ముత్తవ్వ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement