నిర్మల్‌టౌన్: మధ్యవర్తిత్వంతో అధిక సంఖ్యలో కేసులు త్వరితగతిన పరిష్కరించేలా న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా జడ్జి శ్రీవాణి సూచించారు. ఇరుపక్షాల అంగీకారంతో వివాదాలను సులభంగా పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో శనివారం న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. కేసుల పరి ష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, అధిక సంఖ్య లో కేసులను పరిష్కరించే విధానంపై న్యాయవాదులతో చర్చించారు. కేసుల స్వభావాన్ని బట్టి మధ్యవర్తిత్వంకు అనుకూలమైన కేసులను గుర్తించి, ఇరుపక్షాలతో చర్చలు జరిపి పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పోరిక రవీందర్, నిర్మల్ బార్ అసోసియేషనన్ ఉపాధ్యక్షుడు నర్సారెడ్డి, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక లోక్‌అదాలత్‌లో 48 కేసుల పరిష్కారం
బ్యాంకర్లకు సంబంధించిన కేసుల పరిష్కారం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక లోక్‌అదాలత్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ అదాలత్‌లో మొత్తం 48 ప్రీ–లిటిగేషన్‌న్ కేసులు పరిష్కారమయ్యాయి. వీటి ద్వారా మొత్తం రూ.24,34,667 రికవరీ అయ్యాయి. నిర్మల్ డీఎల్‌ఎస్‌ఏ పరిధిలో 17 కేసులు పరిష్కరించగా, రూ.8,88,000 లక్షలు సెటిల్‌మెంట్ అయ్యాయి. భైంసా పరిధిలో 31 కేసులు పరిష్కరించగా, రూ.15,46,667 సెటిల్‌మెంట్ జరిగింది.


