నిర్మల్‌చైన్‌గేట్: పెండింగ్ భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారుల ను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో పెండింగ్ భూభారతి దరఖాస్తుల పరిష్కారం, రీస ర్వే ప్రక్రియ నిర్వహణ అంశాలపై శనివారం స మీక్ష నిర్వహించారు. పెండింగ్ దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించాలన్నారు. క్షేత్రస్థాయిలో అటవీ, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో సంయుక్తంగా సర్వేలు చేయాలన్నారు. రీసర్వే ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సబ్ కలెక్టర్, ఆర్డీవో తహసీల్దార్లు రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. స మావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్(రెవెన్యూ) రాథోడ్ రమేశ్, డీఎఫ్‌వో సుశాంత్ సుఖదేవ్ బోబడే, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో దేవీదాస్, అటవీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
కస్బా పాఠశాల భవనం వసతి గృహానికి
నిర్మల్‌చైన్‌గేట్: పట్టణంలోని కస్బా ఉన్నత పాఠశాల భవనాన్ని బీసీ బాలుర సంక్షేమ వసతి గృహంగా వినియోగించాలని, ఈమేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. శనివారం భవనాన్ని పరిశీలించారు. అవసరమైన మార్పులు, మరమ్మతులు చేపట్టి, వీలైనంత త్వరగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌వెంట డీఈవో భోజన్న, బీసీ, మైనార్టీ సంక్షేమ అధికారులు శ్రీనివాస్, దయానంద్, సహాయ బీసీ సంక్షేమ అధికారి సత్యనారాయణ, తహసీల్దార్ రాజు ఉన్నారు.


