తండ్రి ప్రోత్సాహమే.. తన్వి విజయపథం | - | Sakshi
Sakshi News home page

తండ్రి ప్రోత్సాహమే.. తన్వి విజయపథం

Sep 27 2026 12:10 AM | Updated on Sep 27 2026 12:10 AM

నిర్మల్‌టౌన్‌: తండ్రి ప్రోత్సాహం ఉంటే పిల్లలు తమకు ఇష్టమైన రంగంలో అద్భుతంగా రాణించగలరనడానికి తన్వి యాదవ్‌ ప్రయాణం ఓ ఉదాహరణ. నిర్మల్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు భూమన్న యాదవ్‌, గణిత ఉపాధ్యాయురాలు సుజాత దంపతుల కుమార్తె తన్వి యాదవ్‌. చిన్ననాటి నుంచే తనకు ఇష్టమైన ప్రతీ అంశంలో తండ్రి భూమన్న ప్రోత్సాహాన్ని అందిస్తూ ముందుకు నడిపించారు. నిర్మల్‌లోని సెయింట్‌ థామస్‌ పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన తన్వి.. చదువుతోపాటు పలు రంగాల్లో ప్రతిభ చాటింది. కరాటేలో ఎల్లో బెల్ట్‌ సాధించడంతోపాటు క్లాసికల్‌, వెస్ట్రన్‌ డాన్స్‌లోనూ శిక్షణ పొందింది. పాఠశాల స్థాయిలో నిర్వహించిన పెయింటింగ్‌ పోటీలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో 8వ తరగతి చదువుతున్నప్పుడే నిర్మల్‌లో నిర్వహించిన ఉద్యమ సభలో పాటపాడి తన ప్రతిభను చాటుకుంది.

అమెరికాలో ఎమ్మెస్‌ పూర్తి..

హైదరాబాద్‌లో బీటెక్‌ పూర్తి చేసిన తన్వి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లింది. యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌లో ఎమ్మెస్‌ కోర్సును ఈ ఏడాది జూన్‌లో విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. చిన్ననాటి నుంచే తన కూతురి ఆసక్తులను గుర్తించి తండ్రి భూమన్న యాదవ్‌ అందించిన ప్రోత్సాహం.. ఆమెను ఒక్కో మెట్టు ఎక్కిస్తూ.. ఉన్నత స్థాయికి చేర్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement