వాతావరణం పొడిగా ఉంటుంది. చాలావరకు ఎండగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది.
తల్లి టీచర్.. కూతురు సూపర్‌వైజర్..!
భైంసాటౌన్: తమ సంతానం తమకంటే ఉన్నత స్థానంలో ఉండాలని తల్లిదండ్రులుకోరుకుంటారు. కానీ, కొందరికే ఆ అవకాశం దక్కుతుంది. ముఖ్యంగా తాము పనిచేసే చోటే తమకంటే ఉన్నతస్థానంలో ఉంటే ఆ సంతోషమే వేరు. భైంసా పట్టణానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ తోలాజి సవిత–దత్తు దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. వీరిలో కూతురు శ్రీవల్లి ప్రస్తుతం ఐసీడీఎస్‌లో అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నారు. శ్రీవల్లి పదో తరగతి వరకు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తి చేశారు. సివిల్స్ లక్ష్యంగా సిద్ధమవుతున్న తరుణంలో ఐసీడీఎస్‌లో సూపర్‌వైజర్ పోస్టులకు నోటిఫికేషన్ పడింది. దీంతో తల్లి సవిత సూచనతో మొదటి ప్రయత్నంలోనే(2025) సూపర్‌వైజర్ పోస్టుకు ఎంపికై ంది. ప్రస్తుతం మహాగాంలో సూపర్‌వైజర్‌గా చేస్తున్నారు. తల్లి, కూతురు ఒకే శాఖలో పని చేస్తుండడం, తోటి ఉద్యోగుల అభినందనలతో తల్లిగా తనకెంతో గర్వంగా ఉంటుందని సవిత చెప్పుకొచ్చారు.


