నిర్మల్‌చైన్‌గేట్: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ అందాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై సంబంధిత శాఖల అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా అమలవుతున్న పథకాలు, ప్రజలకు చేకూరిన లబ్ధి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ప్రతీ పథకం అర్హులకు చేరేలా అధికారులు చొరవ చూపాలన్నారు. పథకాల అమలులో ఇబ్బందులు కలిగితే వెంటనే పరిష్కరించాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో విజయలక్ష్మి, మైనార్టీ సంక్షేమ అధికారి దయానంద్, సీపీవో గంగారెడ్డి, డీఎంహెచ్‌వో రాజేందర్, వ్యవసాయ అధికారి సుజాత, హార్టికల్చర్ అధికారి రమణ, హౌసింగ్ పీడీ శ్రీనివాస్‌రెడ్డి, సంక్షేమ అధికారి వినూత్న తదితరులు పాల్గొన్నారు.


