భైంసారూరల్: 6–14 ఏళ్లలోపు బాలలను పని లో పెట్టుకుంటే చర్యలు తప్పవని కార్మికశాఖ చైల్డ్ వెల్ఫేర్ న్యాయ సలహాదారు నరేందర్ హె చ్చరించారు. మంగళవారం మండలంలోని తి మ్మాపూర్ గ్రామంలో ఇద్దరు బాల కార్మికులను గుర్తించిన ఆయన గ్రామ సర్పంచ్ సంజీవ్‌రావు సమక్షంలో వారిని ప్రభుత్వోన్నత పాఠశాలలో చేర్పించారు. చదువుకునే వయస్సు పిల్లలను పనులకు పంపించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట ఎస్సై దయాల్‌సింగ్, సిబ్బంది ఉన్నారు.


