ఓవర్‌ టు పైలట్‌ | - | Sakshi
Sakshi News home page

ఓవర్‌ టు పైలట్‌

Jul 29 2026 12:22 AM | Updated on Jul 29 2026 12:22 AM

● జిల్లాలో ఇక ఏవియేషన్‌ అకాడమీలు ● రెండు ప్రైవేట్‌, ఆరు ఎంఆర్‌వో కేంద్రాలు ● కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు ● ఐఏఎఫ్‌ ట్రైనింగ్‌ ఏర్పాటు నేపథ్యంలో..

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్టుతో పాటు ఇండియన్‌ ఎయిర్‌పోర్స్‌కు చెందిన శిక్షణ కేంద్రం ఏర్పాటు కానున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్‌ ఏవియేషన్‌ అకాడమీలు కూడా ఈ ప్రాంతంపై దృష్టి సారించాయి. ప్రైవేట్‌ పైలట్‌ శిక్షణ సంస్థలు రెండు ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నాయి. అలాగే ఆరు ఎంఆర్‌ఓ (నిర్వహణ), రిపేర్‌ (మరమ్మతు), ఓవర్‌హాల్‌ (సమగ్ర తనిఖీ) కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ దిశగా అడుగులు పడ్డాయి. కేంద్ర రక్షణ శాఖకు దరఖాస్తు చేసుకున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో జాయింట్‌ యూజర్‌ ఎయిర్‌ఫీల్డ్‌ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఆధ్వర్యంలో సివిల్‌ ఏవియేషన్‌ ఎన్‌క్లేవ్‌ ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనుండగా, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రంతో పాటు ఎంఆర్‌వో ఇతరత్రా సదుపాయాలతో ఏర్పాటు కానుంది. ఇందుకోసం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 2009 ఎకరాల భూసేకరణకు గాను రూ.2278 కోట్ల నిధుల మంజూరు చేస్తూ ఈనెల 25న జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. భూసేకరణతో పాటు ప్రతిపాదిత ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అడ్డంకులు తొలగించేందుకు వివిధ పనుల కోసం ఈ నిధులు వెచ్చింనున్నారు.

ప్రైవేట్‌ అకాడమీల దృష్టి..

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టుతో పాటు వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుండగా ఇక్కడ ప్రైవేట్‌ అకాడమీలు కూడా శిక్షణకు ముందుకు వస్తున్నాయి. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ వివిధ ప్రైవేట్‌ అకాడమీలను సంప్రదించగా వారు ఈ ప్రాంతంలో ఏర్పాటుకు ఆసక్తి కనబర్చుతూ తమ దరఖాస్తులు అందజేశారు. తాజాగా ఎమ్మెల్యే ద్వారా వాటిని కేంద్ర రక్షణ శాఖకు అందజేశారు.

అకాడమీలు ఇలా..

పైలెట్‌ శిక్షణ ఆసక్తి కనబర్చే వారికి విమానం నడపడం నేర్పిస్తారు. దాంతో పాటు పైలట్‌ లైసెన్సులు, రేటింగ్‌ల కోసం శిక్షణ ఇవ్వడానికి విమానయాన అధికార సంస్థ (డీజీసీఏ, ఈఏఎస్‌ఏ) నుంచి అధికారిక ఆమోదం పొంది ఉండాలి. అలాంటి సంస్థలే శిక్షణ ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది.

మారుమూల నుంచి

కూడా పైలట్లు..

మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్‌ నుంచి కూడా పైలట్‌ శిక్షణ పొందేందుకు ఇలాంటి అకాడమీలు ఉపయుక్తంగా ఉంటాయి. ప్రైవేట్‌ శిక్షణ కేంద్రాలను సంప్రదించి వాటి ఏర్పాటు విషయంలో రక్షణ శాఖకు దరఖాస్తు చేసుకునేలా చూస్తున్నాం. రానున్న రోజుల్లో ఆదిలాబాద్‌లో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక అభివృద్దితో పాటు శిక్షణ సంస్థలు కూడా ఏర్పాటు కానున్నాయి.

– పాయల్‌ శంకర్‌, ఎమ్మెల్యే ఆదిలాబాద్‌

దరఖాస్తు చేసుకున్న సంస్థలు..

ఎఫ్‌టీవో (పైలట్‌ శిక్షణ సంస్థలు)

2. వింగ్‌ ఏవియేషన్‌ అకాడమీ

1. ఫ్లైటెక్‌ ఏవియేషన్‌ అకాడమీ

ఎంఆర్‌ఓ కేంద్రాలు..

1. జెట్‌ సెట్‌ గో

2. డెక్కన్‌

3. గోల్డన్‌ ఈగల్‌ ఏవియేషన్‌

4. స్టార్‌ ఎయిర్‌

5. యథి ఏవియేషన్‌

6. థంబై ఏవియేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement