న్యూస్‌రీల్
ప్రత్యేక పోలీసుల నియామకం ఆదేశాలు జారీ చేసిన డీజీపీ జిల్లాకేంద్రంలో టీమ్ ఏర్పాటు! ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు ఠాణా ఏర్పాటు ఇప్పట్లో లేనట్లే!
ఆధ్యాత్మికతకు ప్రతీక బాసర క్షేత్రం
బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రం విశిష్టమైందనివేద పండితుడు శశికాంత్ జోషి పేర్కొన్నారు. గురుపౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు క్షేత్ర వైభవంపై ప్రవచనం చేశారు.
జలిసిరితో అదనపు ఆదాయం
దస్తురాబాద్: జలసిరితో రైతన్నలు అదనపు ఆ దాయం పొందవచ్చని డీఆర్డీవో విజయలక్ష్మి సూచించారు. మంగళవారం మండలంలోని భూత్కూర్ పంచాయతీ పరిధి రాంపూర్ గ్రా మంలో రైతు నిర్మించుకున్న ఫామ్‌పాండ్‌లో చే పపిల్లలు విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇంటింటికీ ఇంకుడుగుంత, ప్ర తీ గ్రామానికి ఊరకుంట, ప్రతీ రైతు పొలంలో నీటికుంట నిర్మించుకున్నప్పుడే భూగర్భ జలా ల పెంపు సాధ్యమవుతుందన్నారు. ఎంపీడీవో సయ్యద్ జావేద్ అలీ, ఎంపీవో రమేశ్‌రెడ్డి, ఏపీవో రవిప్రసాద్, పంచాయతీ కార్యదర్శి అనిల్, ఫీల్డ్‌అసిస్టెంట్ అంజలి, కిషన్ పాల్గొన్నారు.
నిర్మల్: జిల్లాకేంద్రంలోని ట్రాఫిక్ సమస్యకు క్రమంగా ఊరట లభిస్తోంది. ‘సాక్షి’ ఇటీవల వరుస కథనాలు ప్రచురించి అధికా రుల దృష్టికి సమస్య తీసుకువచ్చింది. ఇప్పటికే ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల ప్ర త్యేకంగా దృష్టిపె ట్టారు. ప్రధానంగా బస్టాండ్ ప్రాంతంలో సమస్య లే కుండా చేశారు. జిల్లాకేంద్రంలో ట్రాఫిక్‌ను అదుపు చేసేందుకు ప్ర త్యేకంగా పోలీస్ బృందాల ను నియమించాలని డీజీపీ సీవీ ఆనంద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అతిత్వరలో ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా పోలీసులను కేటాయిస్తామని ఎస్పీ జానకీ షర్మిల పేర్కొన్నారు.
పెరుగుతున్న జనాభా, వాహనాలు
జిల్లాకేంద్రం జాతీయ రహదారులైన 44, 61కి కూ డలిగా ఉంది. పైగా, ఆదిలాబాద్, నిజామాబాద్, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు ప్రధానకేంద్రంగా మారింది. రోజూ వేలాది కార్లు, లారీలు, బస్సులు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. పట్టణ జనాభాతోపాటు వాహనాల సంఖ్య అధికమవుతుండగా ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారుతోంది. ప్రధానంగా పాత బస్టాండ్, వివేక్‌చౌ క్, శివాజీచౌక్, ఈద్‌గాం లాంటి ప్రాంతాల్లో తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రహదారులపై అక్ర మ పార్కింగ్‌లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు సమస్య ను తీవ్రతరం చేస్తున్నాయి. పండుగలు, మార్కెట్ రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. వీటిపై సంబంధిత శాఖల అధికారుల స్పందన లేక గతంలోనూ కొందరు కోర్టుల వరకూ వెళ్లిన సందర్భాలున్నాయి.
మున్సిపల్ కూడా స్పందిస్తే..
జిల్లాకేంద్రంలో ప్రధానంగా రహదారులు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు, దుకాణాలు, షాపింగ్‌మాల్స్ ఎదుట టేలాలను మున్సిపల్ అధికారులు తొలగించాల్సి ఉంది. కూరగాయలు, పండ్లు విక్రయించడానికి ప్రత్యేకంగా వేర్వేరు మార్కెట్లు ఏర్పాటు చే యాలి. ప్రధానంగా ఎడమవైపు వాహనాలు వెళ్లడానికి ‘ఫ్రీ లెఫ్ట్’ కోసం చౌరస్తాల విస్తరణ పనులూ చే పట్టాలి. ఇదే విషయాన్ని ఇటీవల మున్సిపల్ సమావేశంలోనూ పలువురు కౌన్సిలర్లు లేవనెత్తారు. ఈద్‌గాం, శివాజీచౌక్, జయశంకర్‌సార్ సర్కిల్, వివేక్‌చౌక్, అంబేడ్కర్‌చౌక్‌లో ఆక్రమణలు తొలగించి, నలువైపులా చౌరస్తాలను విస్తరించాలి. అప్పుడే ఫ్రీ లెఫ్ట్, ఎమర్జెన్సీ వాహనాలు వెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
చర్యలు చేపడుతున్నాం
జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పోలీస్‌శాఖ తరఫున బాధ్యతాయుతంగా చర్యలు చేపడుతున్నాం. ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేయాలన్న డీజీపీ ఆదేశాల మేరకు త్వరలోనే సిబ్బందిని నియమిస్తాం. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రజలూ సహకరించాలి.
– డాక్టర్ జానకీషర్మిల, ఎస్పీ
నిర్మల్ బస్టాండ్ వద్ద ప్రశాంతంగా వాహనాల రాకపోకలు
జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో నిధుల కొరతతో కనీసం ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాల మరమ్మతులు చేయించడానికి నెలలపాటు సమయం తీసుకుంటున్నారు. జిల్లాకేంద్రంలో సమస్యలపై విమర్శలు తీవ్రం కాగా పోలీస్‌శాఖ తరఫున ఎస్పీ జానకీషర్మిల చొరవ తీసుకున్నారు. ప్రధానంగా బస్టాండ్ ప్రాంతంలో సీఐ, ఎస్సైలు, సిబ్బందితో రోజంతా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు. పండ్ల దుకాణాలు, తోపుడు బండ్లు రోడ్డుపైకి తీసుకువచ్చి, రాకపోకలకు ఇబ్బంది కలిగించవద్దని ఎస్పీ స్వయంగా వచ్చి చెప్పారు. దాదాపు 20రోజులుగా బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య క్లియర్ కావడంతో పట్టణ వాసులూ హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ట్రాఫిక్ ఠాణా ఇప్పట్లో లేనట్లే!
ప్రత్యేక ట్రాఫిక్ బృందం ఏర్పాటు కానున్న నేపథ్యంలో నిర్మల్‌లో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు ఇప్పట్లో ఉండకపోవచ్చని సమాచారం. ప్రస్తుతం జిల్లా పోలీస్ కార్యాలయం ఆధ్వర్యంలోనే ట్రాఫిక్ విభాగం పనిచేసే అవకాశముంది. జిల్లా నుంచి ఠాణా కోసం ప్రతిపాదనలు పంపించినా.. ప్రస్తుతానికి ప్రత్యేక పోలీసులతో సరిపెట్టారు. భవిష్యత్‌లో అవసరాలను బట్టి పూర్తిస్థాయి ట్రాఫిక్ ఠాణా ఏర్పాటు చేస్తారని అధికారులు చెబుతున్నారు.


