నాలుగేళ్ల తర్వాత నూతన పింఛన్లు
అర్హులైన దరఖాస్తుదారుల్లో ఆనందం
ఇప్పటికే 1,44,773మందికి పింఛన్లు
నిర్మల్‌చైన్‌గేట్: నాలుగేళ్లుగా కొత్త పింఛన్ల కో సం ఎదురుచూస్తున్న అర్హులైన దరఖాస్తుదారు ల కల ఎట్టకేలకు ఫలించనుంది. వచ్చే పంద్రాగస్టుకు పంపిణీ చేసేలా ప్రభుత్వం కసరత్తు చే స్తోంది. జిల్లాలో వివిధ కేటగిరీల్లో 1,44,773 మంది చేయూత పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 చొప్పున బ్యాంక్‌లు, పోస్టాఫీస్‌ల ద్వారా పింఛన్ ఇస్తున్నారు. ఇక నుంచి పింఛన్లు బ్యాంక్ ఖాతాల ద్వారానే అందజేయాలని ప్ర భుత్వం నిర్ణయించింది. ఇటీవలే పోస్టాఫీస్‌ల్లో తీసుకునే వారికీ బ్యాంక్‌ల ద్వారా ఇచ్చేలా ఖా తాలు తెరిపించారు. వారంతా ప్రతీ మూడు నె లలకోసారి బ్యాంక్‌కు వెళ్లి ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా అప్‌డేట్ చేసుకోవాలనే నిబంధన విధించారు.
అనర్హుల ఏరివేత
పింఛన్ లబ్ధిదారుల్లో ఎవరైనా చనిపోతే వారి స్థానంలో భర్త లేదా భార్యకు రెండున్నరేళ్లుగా పింఛన్ ఇస్తూ వస్తున్నారు. దీంతో అర్హులైన కొత్తవారు నిత్యం పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేశా రు. జిల్లాలో అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వారిని జాబితా నుంచి తొలగించేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్ర యాప్ ద్వారా ఇంటింటికీ వెళ్లి లైవ్ అథెంటికేషన్ ద్వారా లబ్ధిదారుడి ఫొటో క్యాప్చర్ చేసి వివరాలు నమోదు చేశారు. ఇలా జిల్లాలో అక్రమంగా పెన్షన్ పొందుతున్న 323 మందిని గుర్తించి జాబితా నుంచి తొలగించారు.
పెండింగ్‌లో 3,320 దరఖాస్తులు
జిల్లాలోని 18 మండలాలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో 3,320 మందికి పైగా వివిధ కేటగిరీల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా అధికారులు ద్వారా అర్హులుగా గుర్తించబడి ప్రభుత్వానికి సిఫార్సు చేయబడినవారే. వీరే కాకుండా పరిశీలన పూర్తి కాకుండా పెండింగ్ దరఖాస్తులు జిల్లా, మండల స్థాయిలో కోకొల్లలుగా ఉన్నాయి. కాగా, ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నవారికి ఎప్పుడు పింఛన్లు వస్తాయనే సమాచారం తమ వద్ద లేదని అధికారులు చెబుతున్నారు.
ఆదేశాలు రాలేదు
కొత్త పింఛన్లు మంజూరైనట్లు ఇప్పటివరకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే వెంటనే నిబంధనల ప్రకారం కొత్త పింఛన్ల పంపిణీకి చర్యలు తీసుకుంటాం.
– గంగన్న, డీపీఎం
పంద్రాగస్టు రోజు పంపిణీకి కసరత్తు
మండలం లబ్ధిదారులసంఖ్య
బాసర 2,851
భైంసా 8,039
భైంసా (బల్దియా) 7,794
దస్తురాబాద్ 3,601
దిలావర్‌పూర్ 5,990
కడెం 7,243
ఖానాపూర్ 6,761
ఖానాపూర్(బల్దియా) 3,904
కుభీర్ 9,251
కుంటాల 5,610
లక్ష్మణచాంద 7,906
లోకేశ్వరం 9,448
మామడ 6,511
ముధోల్ 6,181
నర్సాపూర్ (జి) 5,814
నిర్మల్ రూరల్ 7,017
నిర్మల్ (బల్దియా) 14,847
పెంబి 1,794
సారంగపూర్ 11,587
సోన్ 7,022
తానూరు 5,602
జిల్లాలో పెన్షన్లు ఇలా..
మొత్తం పెన్షన్లు 1,44,773
వద్ధాప్య.. 33,890
వితంతు.. 35,664
వికలాంగ.. 9,822
గీత కార్మికులు 266
పైలేరియా రోగులు 221
డయాలసిస్ పేషెంట్లు 110
ఒంటరి మహిళలు 2,093
బీడీ కార్మికులు 61,933


