అవినీతి శాఖలు | - | Sakshi
Sakshi News home page

అవినీతి శాఖలు

Jun 8 2026 11:30 PM | Updated on Jun 8 2026 11:30 PM

● పైసలిస్తేనే పనులు ముందుకు.. ● మున్సిపల్‌, రెవెన్యూ, ఎకై ్సజ్‌ శాఖలపై ఆరోపణలు ● ‘పంచాయతీ’ల్లో ఖర్చుకుమించి బిల్లులు ● కొన్నిశాఖల్లో నెలవారీ వసూళ్లు.. ● వాహనాల పేరిట చేతివాటం మంగళవారం శ్రీ 9 శ్రీ జూన్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

నిర్మల్‌

అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి

నిర్మల్‌ టౌన్‌: అర్జీదారుల నుంచి వచ్చిన సమస్యపై పోలీసులు తక్షణం స్పందించి పరిష్కారానికి చొరవ చూపాలని ఎస్పీ డాక్టర్‌ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించా రు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజ లకు అందించడమే లక్ష్యమన్నారు. పోలీసుల సహాయం కావాలంటే నేరుగా ఠాణాలో ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనుమానాస్ప ద వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

నిర్మల్‌: జిల్లాలో ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు దాడులు చేస్తున్నా.. ఎంతమందిపై కేసులు పెడుతున్నా.. కలెక్టర్‌ వర కూ ఫిర్యాదులు వెళ్తున్నా.. అవినీతి మాత్రం తగ్గడం లేదు. గ్రామ పంచాయతీ మొదలుకుని కలెక్టరేట్‌ వరకూ ప్రతీ పనికో రేటు.. అన్నట్లుగా వసూళ్లరాజ్యం కొనసాగుతోంది. రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, పౌరసరఫరాలు, రిజి స్ట్రేషన్స్‌ ఇలా ఆ శాఖ, ఈ శాఖ అని కాదు.. దాదాపు అన్నిచోట్లా పని కంటే.. సంపాదనపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ ఎక్కడికక్కడ ఓ రేటు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో చాలామంది మండలస్థాయి అధికారులూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు, ఫిర్యాదులూ ఉన్నాయి.

ఫీల్డ్‌ విజిట్‌ లేకున్నా..

జిల్లాలో ప్రభుత్వ పనులకు సంబంధించిన బిల్లులు, పేమెంట్లు చేసే ఓ శాఖలో వాహనాల పేరిట డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. సంబంధిత శాఖ అధికారికి ఫీల్డ్‌వర్క్‌ ఉండదు. కేవలం ఆఫీస్‌ పని మాత్రమే ఉంటుంది. అయినా ఓ ప్రైవేటు టాక్సీ కారు ను అద్దెకు తీసుకున్నట్లు అగ్రిమెంట్‌ చేసుకుని, నెలకు రూ.30 వేలకుపైగా బిల్లులు పెట్టుకున్నట్లు కలెక్టర్‌తోపాటు ఏసీబీ అధికారులకూ ఫిర్యాదు వెళ్లింది.

‘ఇండస్ట్రియల్‌’లో

ఉందంటూ..

జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌పైనా ఆ రోపణలు ఉన్నాయి. ఇంటి నిర్మాణ అనుమతి కో సం వెళ్తే ఇందులో పనిచేసే కొంతమంది డబ్బులిస్తే కానీ రాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. మున్సిపల్‌పై పెద్దగా అవగాహన లేని ఓ సామాన్యుడు ఇంటి నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకుంటే ‘నీది ఇండస్ట్రియల్‌ ఏరియా’లో ఉంది. పర్మిషన్‌ రావాలంటే ఖర్చు అవుతుందని డబ్బులు డిమాండ్‌ చేయడం గమనార్హం. అలాగే.. రెవెన్యూ విభాగంలో పనిచేసే సిబ్బంది గతంలో డబ్బులు తీసుకుని ఆస్తిపన్నులనూ తగ్గించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

పని గోరంత.. బిల్లు కొండంత..

‘ఏం అన్నా.. గింత తక్కువ బిల్లు రాసినవ్‌.. గిట్లయితే మేమెట్ల బతకాలె. నేను చెప్పింది రాసియన్నా..’ అంటూ జిల్లాకేంద్రంలోని ఓ షాపు నుంచి వస్తువులు తీసుకెళ్తున్న ఓ పంచాయతీ కార్యదర్శి అన్న మాటలివి. చేసే పనులకు, వారు రాసిచ్చే బిల్లులకు పొంతన ఉండటం లేదు. జిల్లాలోని చాలామంది పంచాయతీ కార్యదర్శులపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. అయినా చాలామందిలో మార్పు కనిపించడం లేదు.

ప్రతినిధులదీ అదే దారి..!

సారంగపూర్‌ మండలంలో ఓ చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగం చేసుకునే యువకుడు ఇటీవల మృతిచెందాడు. సామాన్య కుటుంబం కావడంతో అదే పనిని తన తమ్ముడికి ఇవ్వాలని కోరారు. అందుకు సంబంధిత ప్రతినిధి డబ్బులు డిమాండ్‌ చేయడం గమనార్హం. రూ.2 లక్షలు ఇచ్చుకోలేని ఆ కుటుంబం కన్నీళ్లతో వెనుదిరిగింది. జిల్లాకేంద్రంలోని మెడికల్‌కాలేజీలో అవుట్‌సోర్సింగ్‌ నియమాకాల్లోనూ డబ్బులివ్వనిదే పోస్టులు ఇవ్వలేదన్న ఫిర్యాదులు వచ్చాయి. కానీ.. వాటిని అధికారులు కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం. ఇటీవల బాసర ట్రిపుల్‌ఐటీలోనూ సెక్యూరిటీ గార్డుల నియమాకాల్లో ఇదేతంతు కొనసాగింది. చాలాచోట్ల కొంతమంది ప్రజాప్రతినిధులు, నేతలు మధ్యవర్తిత్వం పేరిట సదరు అధికారులతో కుమ్మకై ్క ఆశావహుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న దాఖలాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఫిర్యాదులు చేస్తున్నా..

పైసావసూళ్లు, శాఖల్లో అవినీతిపై చాలాసార్లు ఆధారాలతో ఫిర్యాదులు చేస్తున్నా.. జిల్లా అధికారులు పెద్దగా స్పందించడం లేదు. ఓ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా వాహనం పేరిట బిల్లులు లేపిన విషయంపై గత కలెక్టర్‌తో పాటు ఏసీబీ అధికారుల వరకూ ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి స్పందన రాలేదు.

చేయి తడిపితేనే సర్టిఫికెట్‌..

మిగతా శాఖలతో పోలిస్తే రెవెన్యూశాఖలో అవినీతి అధికంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ చిన్న సర్టిఫికెట్‌ కావాలన్నా.. ఎంతోకొంత చేతిలో పెట్టాల్సిందేనని సామాన్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం కాలేజీలు, పైచదువులకు వెళ్లే పిల్లలకు కులం, ఆదాయం, ఈడబ్ల్యూఎస్‌ తదితర సర్టిఫికెట్లు అవసరం. వీటిని ఇవ్వడానికీ.. డబ్బులు ఆశిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

నెలనెలా వసూలు..

ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే ఎకై ్సజ్‌శాఖలో కొంతమంది సొంత ఆదాయాన్నీ సమకూర్చుకుంటున్నా రు. ప్రతీ వైన్స్‌ నుంచి నెలకు ఇంత చొప్పున సంబంధిత అధికారులకు మాముళ్లు వెళ్తున్నాయి. ఇందుకు వైన్సుల పరిధిలో కొనసాగే బెల్ట్‌షాపులను, మద్యం అమ్మకాలను చూసీచూడనట్లుగా వదిలేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. మద్యం దుకాణాలతోపాటు సిట్టింగ్‌ నడిపించే హోటళ్లు, దాబాల నుంచీ రెండుమూడు నెలలకోసారి మాముళ్లు అందుతాయని, అందుకే సదరు సిట్టింగ్‌ల వైపు కన్నెత్తి చూడటం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement