నిజాయతీ చాటుకున్న పార్‌పల్లి వాసి.. | - | Sakshi
Sakshi News home page

నిజాయతీ చాటుకున్న పార్‌పల్లి వాసి..

Jun 8 2026 11:30 PM | Updated on Jun 8 2026 11:30 PM

లక్ష్మణచాంద: తన ద్విచక్ర వాహనంలో ఇతరుల డబ్బులు రావడంతో ఇంటికి వెళ్లిన తరువాత గమనించి తనవి కావని తిరిగి అప్పగించి నిజాయతీ చాటుకున్నాడు మండలంలోని పార్‌పల్లి వాసి. మండల కేంద్రానికి చెందిన గంట శంకర్‌ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి పంట డబ్బులను అవసరం నిమిత్తం రూ.30 వేలు విత్‌డ్రా చేసుకుని తన బైకులో పెట్టుకున్నా అనుకుని పార్‌పల్లికి చెందిన ఒడిషెల భీమేష్‌ బైక్‌లో పెట్టాడు. ఇంటికి వెళ్లిన శంకర్‌ తన బైకు కవర్‌లో డబ్బులు లేకపోవడంతో ఆందోళన చెంది మళ్లీ బ్యాంకు వచ్చాడు. ఇదే భీమేష్‌ బ్యాంకుకు పని నిమిత్తం వచ్చి అనంతరం ఇంటికి వెళ్లాడు. తన ద్విచక్ర వాహనం ట్యాంకు కవర్‌లో డబ్బులు చూసి షాక్‌ అయ్యాడు. తేరుకుని తనవి కావని వెంటనే లక్ష్మణచాంద బ్యాంకుకు చేరుకున్నాడు. తన బైకులో ఎవరివో రూ.30 వేలు వచ్చాయని మేనేజర్‌ రాజశేఖర్‌కు తెలిపాడు. ఆందోళనతో వచ్చిన శంకర్‌ డబ్బులుగా గుర్తించి భీమేష్‌ చేతుల మీదుగా శంకర్‌ తల్లి ముత్తవ్వకు అందచేశారు. వారు భీమేష్‌ను అభినందించారు. కృతజ్ఞతలు తెలిపారు.

నిజాయతీ చాటుకున్న హోంగార్డు

బాసర: బాసర ఆలయ సిబ్బంది మరోమారు నిజాయతీ చాటుకున్నారు. ఇటీవలే హైదరా బాద్‌కు చెందిన ఓ భక్తురాలి బంగారు చెవిపో గు ఆలయ ఆవరణలో పడిపోగా, వెతికి అప్పగించారు. తాజాగా కుంటాల మండలం లింబ (కే)గ్రామానికి చెందిన సునీత అనే భక్తురాలు సోమవారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవా రి దర్శనానికి వచ్చారు. అమ్మవారి దర్శనం కో సం క్యూలైన్‌లో పర్సు పోగొట్టుకుంది. అందులో ఆధార్‌, ఏటీఎం కార్డు, సెల్‌ ఫోన్‌, రూ.2 వే ల నగదు ఉన్నాయి. ఆలయ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో విధులు నిర్వహిస్తున్న ఆల య హోంగార్డులు ఇందాల్‌ నారాయణ పర్సు ను వెతికి భక్తురాలికి తిరిగి అప్పగించాడు. హోం కార్డును భక్తులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement