ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

Jun 8 2026 11:30 PM | Updated on Jun 8 2026 11:30 PM

● కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

నిర్మల్‌చైన్‌గేట్‌/భైంసాటౌన్‌: రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్ట ర్‌ భవేశ్‌ మిశ్రా హెచ్చరించారు. భైంసా పట్టణంలో డీఏపీని నిర్ణీత ధర కంటే ఎక్కువకు విక్రయించిన ఘటనపై శ్రీడీఏపీపై దోపిడీశ్రీ శీర్షికన సోమవారం శ్రీసాక్షిశ్రీలో ప్రచురితమైన కథనానికి వ్యవసాయ శాఖ అధికారుల విచా రణ చేశారు. నివేదిక ఆధారంగా సంబంధిత డీలర్‌ లైసెన్సును సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. వానాకా లం సాగు ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు డీఏపీని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో తనిఖీలు నిర్వహించామన్నారు. అదేవిధంగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన మరో నలుగురు ఎరువుల డీలర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. అధిక ధరలు వసూలు చేయడం, ఎరువులు, విత్తనాల కృత్రిమ కొరత సృష్టించడం, నకిలీ విత్తనాల విక్రయం వంటి చర్యలను ప్రభుత్వం సహించదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement