బాసర: నిజామాబాద్–భైంసా ప్రధాన రహదారిపై బాసర పరిసర ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు. పోలీస్, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు సంయుక్తంగా ప్రధాన రహదారిని పరిశీలించి ప్రమాదకర ప్రాంతాలను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 26 యాక్సిడెంట్ స్పాట్లను గుర్తించినట్లు డీఎస్పీ ఉపేంద్రారెడ్డి తెలిపారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.


