నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Jun 7 2026 11:39 PM | Updated on Jun 7 2026 11:39 PM

● జిల్లా వ్యాప్తంగా 35,177 దరఖాస్తులు ● ఏడాది కిందటే లబ్ధిదారుల ఎంపిక సోమవారం శ్రీ 8 శ్రీ జూన్‌ శ్రీ 2026 8లోu ● జిల్లాలో బీసీ అభివృద్ధి శాఖ ద్వారా 17,286 మంది బీసీలు, 504 ఎంబీసీలు, 419 మంది ఈబీసీలు దరఖాస్తు చేసుకోవగా 3, 876 మంది బీసీలు, 842 మంది ఈ బీసీలకు యూనిట్లు కేటాయించారు. ● ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 7,350 దరఖాస్తులకు 2,894 యూనిట్లు కేటాయించారు. ● మైనారిటీ సంక్షేమశాఖ ద్వారా 5,926 మైనారి టీ, 65 క్రిస్టియన్‌ దరఖాస్తులకు 1,045 మైనా ర్టీ, 27 క్రిస్టియన్లకు యూనిట్లు కేటాయించారు.

న్యూస్‌రీల్‌

ఆ తర్వాత పట్టించుకోని ప్రభుత్వం రుణాల కోసం నిరీక్షిస్తున్న యువత

బుస కొడుతున్న సర్పాలు

జనావాసాలు, వీధులు, రోడ్లపై విష సర్పాలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. రక్త పింజరలు, నాగుపాములు ఇళ్లలోకి దూరి ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.

గజ్జలమ్మా.. కరుణించమ్మా..

కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీగజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవార్ల ఆలయాలకు ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. మహా రాష్ట్రలోని ముంబై, నాందేడ్‌, ధర్మాబాద్‌, బోకర్‌, హిమాయత్‌నగర్‌, ఇస్లాపూర్‌ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. ఆలయానికి చేరుకుని బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తలనీలాలు, ఎత్తు బంగారం (బెల్లం) సమర్పించా రు. ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని వేడుకున్నారు. అర్చకులు శ్రీకాంత్‌ రామానుజదాస్‌, నగేశ్‌ ఆ ధ్వర్యంలో గజ్జలమ్మకు అభిషేకం, అలంకరణ, అర్చన, హారతి, పల్లకీసేవ తదితర పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు.

నిర్మల్‌చైన్‌గేట్‌: రాజీవ్‌ యు వ వికాసం పథకం లబ్ధి దారుల ఎంపికతోనే ఆగిపోయింది. యువతకు స్వ యం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో గతేడాది మే నెలలో అర్జీలు స్వీకరించిన ప్ర భుత్వం రుణాల ఊసే ఎ త్తడం లేదు. గతేడాది జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు ఇస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం ఆ తర్వాత మిన్నకుండి పోయింది. అనంతరం దరఖాస్తుల పరిశీలన ప్రక్రి య పూర్తి చేసింది. ఆ తర్వాత రాజీవ్‌ యువ వికా సం పథకం అమలుపై కదలిక లేకపోవడంతో దరఖాస్తుదారులు నిరాశకు గురవుతున్నారు.

నిరాశ చెందుతున్న యువత

గత ప్రభుత్వాలు ప్రతీ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఆయా సామాజికవర్గాల యువతకు రాయితీపై రుణాలు పంపిణీ చేసేవి. దీంతో లబ్ధిదారులు రాయితీ పొందేవారు. కానీ, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళితబంధు, బీసీ బంధు పథకాల పేరిట కొంత మందికే లబ్ధి చేకూర్చి ముఖం చాటేసింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత కార్పొరేషన్లను అన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ‘రాజీవ్‌ యువ వికాసం’ కింద రాయితీ రుణాలివ్వడానికి నిర్ణయించింది. దీంతో ఏడాది క్రితం జిల్లాలోని సుమారు 35వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఏ ఒక్కరికీ రుణం పంపిణీ చేయకపోవడంతో వారిలో నిరాశే మిగిలింది.

దరఖాస్తులు ఎక్కువ.. మంజూరు తక్కువ

ఇంటర్వ్యూలు నిర్వహించి..

తొలుత ప్రభుత్వం దరఖాస్తుదారులకు మండల పరిషత్‌, మున్సిపల్‌ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఆ తర్వాత అర్హులైన వారికి యూని ట్‌ విలువ ప్రకారం ఐదు విడతల్లో గత అక్టోబర్‌ వరకు మంజూరు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలివిడతలో కేటగిరీ–1లో రూ.50 వేలు, కేటగిరీ–2 లో రూ.లక్ష రుణాల వరకు ఎంపికై న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. కానీ, ఈ ప్రక్రియ వాయిదా పడటంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. కాగా, ముఖ్యంగా సిబిల్‌ స్కోర్‌ను మినహాయిస్తేనే గ్రామీణ ప్రాంతంలోని ఎక్కువ మంది నిరుద్యోగులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశముంటుంది.

మండలాలవారీగా వచ్చిన దరఖాస్తులు

మండలం ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ

బాసర 25 196 403 115

భైంసా 82 638 1,228 253

దస్తురాబాద్‌ 161 302 488 2

దిలావర్‌పూర్‌ 130 191 534 163

కడెం 412 690 930 83

ఖానాపూర్‌ 274 536 957 67

కుభీర్‌ 469 431 1,234 107

కుంటాల 94 261 799 89

లక్ష్మణచాంద 103 280 717 78

లోకేశ్వరం 110 431 811 74

మామడ 325 238 501 124

ముధోల్‌ 95 338 586 298

నర్సాపూర్‌ (జి) 88 229 644 164

నిర్మల్‌ రూరల్‌ 178 334 869 70

పెంబి 207 97 234 20

సారంగపూర్‌ 499 425 1,387 160

సోన్‌ 101 204 722 75

తానూర్‌ 143 375 755 95

భైంసా బల్దియా 21 383 952 1,218

ఖానాపూర్‌ బల్దియా 28 259 784 340

నిర్మల్‌ బల్దియా 82 514 2,757 2,376

కార్పొరేషన్‌ దరఖాస్తులు యూనిట్లు రాయితీ

(రూ.కోట్లలో)

ఎస్సీ 7,350 2,894 39.96

ఎస్టీ 3,627 2,325 25.35

బీసీ 17,286 3,876 41.00

ఏంబీసీ/ఈబీసీ 923 842 8.90

మైనార్టీ 5,926 1,045 17.41

క్రిస్టియన్‌ 65 27 0.42

బ్యాంకులు సమ్మతించినా..

రాజీవ్‌ యువ వికాసం పథకంలో భాగంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ.50వేల వరకు రుణ సదుపాయం కల్పిస్తే 100 శాతం, రూ.లక్ష వరకు 90శాతం, రూ.2లక్షల వర కు 80శాతం, రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు రుణం పొందినవారికి 70శాతం రాయితీ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కువ మంది రూ. 4లక్షల వరకు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా రు. బ్యాంకులూ సమ్మతించినా ప్రభుత్వం రాయితీ నిధులు విడుదల చేయకపోవడంతో బ్యాంకర్లు ఏమీచేయలేకపోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పునరాలోచన చేసి పథకాన్ని పునరుద్ధరించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement