నిర్మల్‌చైన్‌గేట్: అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన పోషకాహారం అందించాలని జిల్లా ఆహార భద్రత అధికారి సునీత సూచించారు. ‘ప్రజాపాలన–ప్రగ తి ప్రణాళిక‘, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం అంగన్‌వాడీ టీచర్లకు ఆహార భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. ప్రపంచ ఆహా ర భద్రతా దినోత్సవం సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లకు ఆహార నాణ్యత, భద్రతా ప్రమాణాలపై పూర్తి అవగాహన కల్పించడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన ఆహార నియమాలు అమలయ్యేలా నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. భవిష్యత్‌లోనూ మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ అధి కారి వినూత్న, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


