నిర్మల్‌ఖిల్లా: నిర్మల్‌కు చెందిన ప్రముఖ పద్యకవి, ఉమ్మడి జిల్లా సంస్కృత భాషా ప్రచార స మితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బి.వెంకట్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో ఆది వారం నిర్వహించిన ఏడో ప్రపంచ తెలుగు సా హిత్య మహాసభల్లో ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయంలో చైతన్య సారస్వత పరిషత్, శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మహాసభల్లో డాక్టర్ కత్తిమండ ప్రతాప్‌కుమార్, జి.ఈశ్వరీభూషణం, డాక్టర్ టి.పార్థసారథి, కేవీవీ సత్యనారాయణరాజు చేతుల మీదుగా వెంకట్‌కు పురస్కారం ప్రదానం చేశారు. మహాసభల్లో డాక్టర్ వెంకట్ విశిష్ట అతిథిగా, సమన్వయకర్తగా పాల్గొని తెలుగు భాషా వైభవంపై పద్యపఠనం, గానం చేసి ఆకట్టుకున్నారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా వెంకట్‌కు పురస్కారం ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.


