భైంసాటౌన్: పట్టణంలోని వివేకానంద నిరాశ్రిత పిల్లల ఆవాసాన్ని భైంసా కోర్టు జడ్జి వెంకటరమణ సుహాస్ శనివారం సందర్శించారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం పిల్లలతో మాట్లాడి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. చదువుపై దృష్టి పెడితే ఎంతటి లక్ష్యమైనా చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. అలాగే నూతనంగా నిర్మించిన అదనపు గదులను పరిశీలించారు. పిల్లలకు కల్పిస్తున్న వసతులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఆవాసం అధ్యక్షుడు శైలేష్ మాశెట్టివార్, న్యాయవాది సంతోష్ కుమార్, వందన, పోశెట్టి, ఆవాసం ఇన్‌చార్జి లింగారెడ్డి ఉన్నారు.


