విభేదాలు వీడి అభివృద్ధి చేయండి | - | Sakshi
Sakshi News home page

విభేదాలు వీడి అభివృద్ధి చేయండి

Jun 7 2026 12:15 AM | Updated on Jun 7 2026 12:15 AM

● అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి ● కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

భైంసాటౌన్‌: ఇటీవల మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో చోటు చేసుకున్న ఘటనలు, వాటిపై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం కారణంగా పట్టణ అభివృద్ధికి విఘాతం కలుగుతుందని, విభేదాలు వీడి పట్టణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మున్సిపాలిటీ అభివృద్ధి సమీక్షలో ఎమ్మెల్యే పి.రామారావు పటేల్‌, ఎస్పీ జానకీషర్మిలతో కలిసి మున్సిపల్‌ చైర్మ న్‌ తూమోల్ల దత్తాత్రి, కౌన్సిలర్లు, అధికారులతో ప లు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, అభివృద్ధి కార్యక్రమాల అమలులో సమస్యలుంటే తమ దృష్టికి తేవా లన్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వరదల ని వారణ చర్యలు, ఘన వ్యర్థాల నిర్వహణ, పట్టణ ప రిశుభ్రత, మొక్కల పెంపకం, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ, తదితర అంశాలపై సూచనలు చేశారు. ఈ అంశాల పై సమగ్ర కార్యాచరణ రూపొందించేందుకు త్వరలోనే మరో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించా రు. కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులు తమ పరిధి కి లోబడి పని చేయాలని, అభివృద్ధికి విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని సూచించారు.

కలిసి పనిచేయాలి..

పట్టణ అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్‌ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో విభేదాలకు తావు లేకుండా చూడాలని సూచించారు. వార్డుల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించేలా కౌన్సిలర్లు చొరవ చూపాలని, సమస్యలు ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.

అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు..

సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ జానకీషర్మిల హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలు, విద్వేషపూరిత వ్యాఖ్య లు, కల్లోలాలు సృష్టించే పోస్టులు పెడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించా లని ప్రజలకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ బి.వెంకటేశ్వర్లు, సబ్‌ కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌ కుమార్‌, ఏఎస్పీ సాయికిరణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ లింగయ్య, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి ధాన్యం కొనుగోళ్లు, ఈ నెల 9న నిర్వహించనున్న మండల మహిళా సమాఖ్య సభ్యులకు ఆర్టీసీ బస్సుల పంపిణీ కార్యక్రమం, నీట్‌ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భైంసా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే లారీల ద్వారా మిల్లులు, గోదాములకు తరలిస్తున్నట్లు చెప్పారు. కొనుగోళ్లు త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. జూన్‌ 9న హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్న మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ బస్సుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా నుంచి లబ్ధి దారులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వీడి యో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ బి.వెంకటేశ్వర్లు, భైంసా సబ్‌కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌ కుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement