నిర్మల్‌టౌన్: పెండింగ్ కేసుల సత్వర పరిష్కారాని కి ఈనెల 20న ప్రత్యేక లోక్‌అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. జిల్లా ప్రధాన కోర్టులో జిల్లా జడ్జి, ఎస్పీ పోలీస్ అధికారులతో శనివారం కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులపై చర్చించారు. కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించా రు. అనంతరం జడ్జి మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చని తెలిపారు. లోక్ అదాలత్ సేవలు ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందుతాయని పేర్కొన్నారు. రాజీ పద్ధతిలో క్రిమినల్, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన కేసులు, వైవాహిక జీవితం, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాదాలు ఇతర కేసులపై సంబంధించిన కేసులను ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించుకోవచ్చని సూచించారు. అనంతరం ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ.. రాజీమార్గం రా జమార్గమని, చిన్నచిన్న కేసులతో కక్ష పెంచుకుని కోర్టుల చుట్టూ.. తిరుగుతూ సమయాన్ని, డబ్బుల ను వృథా చేసుకోవద్దని సూచించారు. లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించుకుని సమయం, డబ్బు ఆదా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ రాధిక, అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, అన్ని కోర్టుల జడ్జీలు, పోలీస్ అధికారులు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.


