నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చర్యలు

Jun 7 2026 12:15 AM | Updated on Jun 7 2026 12:15 AM

భైంసాటౌన్‌: రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్‌ హెచ్చరించారు. పట్టణంలోని పలు ఫర్టిలైజర్‌, సీడ్స్‌ దుకాణాల్లో శనివారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయా దుకాణాల్లో విత్తనాలు, ఎరువుల నిల్వలు, రికార్డులు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎరువులు అధిక ధరలకు విక్రయించొద్దని డీలర్లకు సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రైతులకు తప్పనసరిగా రశీదు ఇవ్వాలన్నారు. ఆయన వెంట ఏడీఏ వీణ, ఏవో గణేశ్‌ ఉన్నారు.

నూనె గింజలు, పప్పు దినుసులు

సాగు చేయాలి

కుంటాల: రైతులు నూనె గింజలు, పప్పు దినుసులు సాగు చేయాలని డీఏవో అంజిప్రసాద్‌ సూచించారు. మండలంలోని లింబా(కె), గ్రామంలో వానాకాలం పంటల సాగుపై గ్రామ సభ నిర్వహించారు. పంట మార్పిడి చేస్తే దిగుబడి సాధించవచ్చని పేర్కొన్నారు. రైతులు ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టి సారించాలని జిల్లా హార్టికల్చర్‌ అధికారి బీవీ.రమణ సూచించారు. పంట పొలాల్లో నీటి నిల్వ కోసం నీటి కుంటలు నిర్మించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గీత, ఏఈవో శ్రీనివాస్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement