ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు

Jun 7 2026 12:15 AM | Updated on Jun 7 2026 12:15 AM

నిర్మల్‌ రూరల్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్‌ సుధాకర్‌ పేర్కొన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 6 నుంచి 12 వరకు వారం రోజులు ఈ నమోదు కార్యక్రమం ఉంటుందన్నారు. ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు కళాశాలలో చేరి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. కళాశాలలో నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్నారని, అధునాతనమైన సైన్స్‌ ల్యాబ్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌, డిజిటల్‌ గ్రంథాలయం, విశాలమైన క్రీడామైదానం, ఎన్‌సీసీ లాంటి ఏర్పాట్లు ఉన్నాయన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనాలు పొందే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూ చించారు. ఇందులో వైస్‌ ప్రిన్సిపాల్‌ గంగాధర్‌, అధ్యాపకులు శ్రీనివాస్‌, శ్రీహరి, పీజీ.రెడ్డి, సూర్యసాగర్‌, కట్టా రమేశ్‌రెడ్డి, హేమలత, సుభాష్‌, పవన్‌, రజిత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement