నిర్మల్ రూరల్: మండలంలోని వెంగ్వాపేట్ ప్రాథమిక పాఠశాలకు అదనంగా ముగ్గురు ఉపాధ్యాయులను కేటాయించాలని సర్పంచ్ సాద అనిత ఆధ్వర్యంలో గ్రామస్తులు డీఈవో భోజన్నకు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం పాఠశాలలో 100 మంది విద్యార్థులు ఉన్నారని, రాబోయే విద్యా సంవత్సరం మరింత మంది పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే మూడు పోస్టులు ఉన్నాయని కానీ అందులో ఒక పోస్టు ఖాళీగా ఉందన్నారు. విద్యా వలంటీర్లను నియమించడానికి గ్రామంపై ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. వెంటనే ముగ్గురు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై పంపించాలని కోరారు.


