పొద్దున్న పాలతో మొదలు, రాత్రి తీసుకువచ్చే చిరుతిళ్ల వరకు అన్నీ ప్లాస్టిక్ కవర్లలోనే. పాలిథిన్, ప్లాస్టిక్ లేకుండా రోజు గడపలేం అంటే అతిశయోక్తి కాదు. చివరకు శుభకార్యాల్లో మంచి చేయాల్సింది పోయి, ప్లాస్టిక్ కవర్‌తో చేసిన పేపర్‌ప్లేట్లలో వడ్డిస్తున్నారు. మంచినీటిని, టీ, కాఫీలనీ ఆ గ్లాసుల్లోనే తాగిస్తున్నారు. ఇదే రకరకాల క్యాన్సర్లకు కారణమవుతోంది. జిల్లాలో ఇటీవల క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య పెరగడంలో ఇదీ ఓ కారణం కావొచ్చన్న వాదనా ఉంది. మనిషినే కాదు.. ఈ ప్లాస్టిక్ పట్టణాలను ముంచేస్తోంది. డ్రైనేజీలు జామ్ కావడానికి ప్రధాన కారణం ప్లాస్టిక్ వ్యర్థాలే...


