వర్షపునీటిని ఒడిసి పట్టాలి | - | Sakshi
Sakshi News home page

వర్షపునీటిని ఒడిసి పట్టాలి

Jun 5 2026 4:41 AM | Updated on Jun 5 2026 4:41 AM

ఖానాపూర్‌: ఇంకుడుగుంతల ఏర్పాటుతో వర్షపునీటిని ఒడిసి పట్టాలని, ప్రతీ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత నిర్మించుకోవాల ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిర్మూలన, సేవ్‌ వాటర్‌ సోక్‌పిట్స్‌ కార్యక్రమాల్లో భాగంగా మండలంలోని అడవి సారంగాపూర్‌లో గురువారం గ్రామసభ నిర్వహించారు. దీనికి అదనపు కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం, నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎల్పీవో లింగయ్య, ఎంపీడీవో రాధరాథోడ్‌, సర్పంచ్‌ అంకుష్‌రావు, ఎంపీవో రత్నాకర్‌రావు, కార్యదర్శి సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement