బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి అభిషేకం సమయంలో ఓ భక్తురాలు తన కుటుంబంతో అమ్మవారి దర్శనానికి వచ్చా రు. ఈ సందర్భంగా ఆమె చెవి పోగును పోగొట్టుకుంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు రవి, శ్యామ్, ఆలయ జూనియర్ అసిస్టెంట్, ఇన్‌స్పెక్టర్ సాయి విషయం తెలుసుకుని ఆలయ ప్రాంగణం నుంచి వ్యాస మహర్షి ప్రధాన మెట్లమార్గం వరకు వెతికా రు. అక్కడే పడి ఉండడంతో దానిని భక్తురా లు వెంకట నాగలక్ష్మికి అప్పగించారు. దాని విలువ సుమారు రూ.1.30 లక్షలు ఉంటుంద ని తెలిపారు. విధుల్లో నిజాయతీ చాటుకున్న ఉద్యోగులను భక్తులు అభినందించారు.


