కుంటాల: ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొ నే అవకాశం ఉందని, సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కలెక్టర్ భవేశ్‌మి శ్రా పేర్కొన్నారు. మండలంలోని అంబకంటి తండాలో గురువారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఎమ్మెల్యే పవార్ రామారావుపటేల్‌తో కలిసి పా ల్గొన్నారు. వర్షపు నీటిని వృథా చేయకుండా ఒడిసి పట్టాలని సూచించారు. అందరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. అవసరానికి మించి ఎరువులు వాడొద్దని తెలిపారు. మొక్కజొ న్న కొనుగోలులో రాష్ట్రంలో జిల్లా మూడో స్థానంలో నిలిచిందని వెల్లడించారు. నకిలీ విత్తనాలు కొనుగో లు చేయవద్దని, ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రశీదు తీసుకోవాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థి కంగా ఎదగాలని సూచించారు. ఎమ్మెల్యే పవార్ రా మారావు పటేల్ మాట్లాడుతూ.. రైతులు అధికారు ల సూచనలు మేరకు పంటల సాగు చేయాలన్నా రు. మినుములు, పెసర్లు, నువ్వులు, కందులు, పొద్దుతిరుగుడు పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భా గస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు వీవో భవనం, జీవనోపాధి ఆర్థిక అధికారి త కేంద్రాలను ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అంబకంటిలో పాఠశాల ప్రహరీ, వీవో భవనాన్ని ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించా రు. కార్యక్రమంలో డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఏవో అంజిప్రసాద్, హార్టికల్చర్ అధి కారి బీవీ.రమణ, తహసీల్దార్ కమల్‌సింగ్, ఏపీడీ నాగవర్ధన్, ఎంపీడీవో అల్లాడి వనజ, సర్పంచులు జాదవ్ జ్యోతిబాయి, ముజ్గి రాణి పాల్గొన్నారు.


