నిర్మల్‌టౌన్: జిల్లాలో నేరాల సంఖ్యను తగ్గించేందు కు రౌడీషీటర్లపై నిఘా పెంచాలని, నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నవారిపై ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ జానకీషర్మిల పోలీసులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ గురువారం నిర్వహించారు. జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజా సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. వృద్ధులు, మహిళలు, పిల్లల ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని తెలిపారు. దీర్ఘకా లంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై సంబంధిత ఎస్డీపీవోలు మెమోలు జారీచేసి వాటి పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎస్‌హెచ్‌వోలు కేసుల పురోగతిని సమీకరిస్తూ.. పాత కేసుల పరిష్కారంపై రానికి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు గోవర్ధన్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, కృష్ణ, రవీందర్ నాయక్, సమ్మయ్య, సాయికుమార్, దీపక్, అన్ని పోలీసుస్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు పాల్గొన్నారు.
ప్రజల విశ్వాసం పొందాలి
నిర్మల్‌టౌన్: అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజల విశ్వాసం పొందడం పోలీస్ సిబ్బంది ప్రధా న బాధ్యత అని ఎస్పీ జానకీ షర్మిల పేర్కొన్నారు. విధి నిర్వహణలో విశిష్ట ప్రతిభ కనబర్చి సేవా పతకాలను ఎంపికై న 11 మంది పోలీస్ అధికారులు, సిబ్బందినికి జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్పీ పతకాలు అందజేశారు. మరింత బాధ్యతతో పనిచేయడానికి ప్రేరణగా పతకాలు నిలుస్తాయన్నారు. ఎంపికై న వారిలో షేక్ అహ్మద్(ఏఎస్‌ఐ), ఆర్.గంగారాం (ఏఎస్‌ఐ), గంగాధర్(ఏఎస్‌ఐ), రాజారాం(హెచ్‌సీ), పి.మస్తాన్(హెచ్‌సీ), రత్నారావు(హెచ్‌సీ), హెచ్.గంగాధర్ (హెచ్‌సీ), గోవింద్(హెచ్‌సీ), గేమ్‌సింగ్ (ఏఆర్‌హెచ్‌సీ), వెట్టిసింగ్(హెచ్‌సీ), రమేశ్ ఉన్నారు.


