కడెం: మండలంలోని అల్లంపల్లి బాబానాయక్ తండా గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని ఖానాపూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ హామీ ఇచ్చారు. గురువారం ద్విచక్రవాహనంపై గ్రామాల్లో పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి బోరు బావుల డ్రిల్లింగ్‌కు ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. బాబానాయక్ తండాలో అంగన్‌వాడీ కేంద్రం, నూతన పంచాయతీ భవన నిర్మాణాలకు భూమిపూజల చేశారు. గ్రామాల్లో రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అటవీశాఖ అధికారుల కారణంగా నిలనిచిపోయిన ఇందిరమ్మ ఇళ్లను సందర్శించారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అల్లంపల్లి రోడ్డు సమస్య పరిష్కారానికి పూర్తి నివేదికతో జిల్లా సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రాను ఫోన్‌లో కోరారు. శుక్రవారం గ్రామస్తులు, నాయకులు కలెక్టర్ కార్యాలయానికి రావాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్, తాహసీల్దార్ ఖాజా మోయినుద్దీన్, ఎంపీడీవో బి.అరుణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంగన్న, డీసీసీ ప్రధాన కార్యదర్శి సతీశ్‌రెడ్డి, సర్పంచులు సునీత, మాధవ్‌సింగ్, జంగు, విజయలక్ష్మి, దాసునాయక్ పాల్గొన్నారు.


