నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణలో కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని, రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఓ హోటల్‌లో జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అధ్యక్షతన గురువారం పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జిల్లాస్థాయి శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మహేశ్వర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. తెలంగాణలో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రతీ కార్యకర్త అంకితభావంతో ప్రజాక్షేత్రంలో పనిచేయాలన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కృషి చేస్తే తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. శిక్షణ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయశ్రీ, రావుల రాంనాథ్, మేడిసెమ్మె రాజు, యాతాళం చిన్నారెడ్డి, నల్లా రవీందర్‌రెడ్డి, కరిపె విలాస్, సత్యం చంద్రకాంత్, బుర్ర రమేశ్, జిల్లా పదాధికారులు, రాష్ట్ర నాయకులు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.


