నిర్మల్‌టౌన్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా అటవీశాఖ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా అటవీశాఖ కార్యాలయంలో వ్య ర్థాలను తగ్గించండి– ప్రకృతిని రక్షించండి అనే అంశంపై విద్యార్థులకు గురువారం వ్యాసరచన, చిత్రలేఖ నం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీ ఎఫ్‌వో మాట్లాడుతూ.. వేసవి సెలవులు కొనసాగుతున్నప్పటికీ పర్యావరణ పరిరక్షణపై మక్కువతో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీ యమన్నారు. ప్రకృతిని కాపాడడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించవచ్చని సూచించారు. విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో అట వీ శాఖ అధికారులు నాగిని భాను, రామకృష్ణారావు, నజీర్‌ఖాన్, సంతోష్, వెన్నెల, సుజాత పాల్గొన్నారు.


