నిర్మల్‌టౌన్/భైంసాటౌన్: ఆర్టీసీ నిర్మల్, భైంసా డిపోల ఎదుట ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో డ్రైవర్లు, కండక్లర్లు, ఉద్యోగులు ఎన్నికలు వ ద్దు.. విలీనం ముద్దు అనే నినాదంతో ఆది వారం ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపా రు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పి ఇప్పుడు ఎన్నికలైన తర్వాత వీలినం చేద్దామని మంత్రి పొన్నం ప్రభాకర్ అనడం కార్మికుల మనోభావాలను దెబ్బ తీయడమే అని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జూన్ 2న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించాలని కోరారు. లేనిపక్షంలో మరో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.


