లక్ష్మణచాంద: ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలో పేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆదివారంతో వేసవి సెలవులు ముగిశా యి. సోమవారం జూనియర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కళాశాలల ప్రా రంభం రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరినట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నా యి. ఇందులో ఇంటర్ రెండో సంవత్సరంలో 2,592 మంది విద్యను అభ్యసిస్తున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కొనసాగుతున్నాయని ఇందులో కూడా 2,500 మంది విద్యార్థులు చేరుతారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ద్వితీ య సంవత్సరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు చేరాయి. త్వరలో ప్రథమ సంవత్సరంలో చేరుతు న్న విద్యార్థులకు సరిపడా పాఠ్య పుస్తకాలు కూడా వస్తాయని పేర్కొన్నారు. ఈసారి ఇంటర్ విద్యార్థులకు అల్పాహారంతోపాటు మధ్యాహ్న భోజనం కూడా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంతో పోలిస్తే ఈసారి మరింత ఎక్కువ మంది ప్రవేశాలు పొందే అవకాశం ఉందని అధ్యాపకులు భావిస్తున్నారు.
క్యూర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు...
ఈసారి మారిన సిలబస్ పూర్తిగా ఏఐ, డిజిటల్ చి త్రాలతో విద్యార్థులనుట్టే ఆకట్టుకునేవిధంగా పాఠ్య పుస్తకాలను ముద్రించారు. విద్యార్థుల విషయ పరి జ్ఞానం పెంపొందేలాగా నిడివి, నియంత్రణ పాటిస్తూ పాఠ్యాంశాలను రూపొందించినట్లు అధ్యాపకు లు అంటున్నారు. పుస్తకంపై ముద్రించిన క్యూర్ కో డ్‌ను స్కాన్ చేస్తే ఆడియో, వీడియో పాఠాలు ప్రత్యక్షమై విద్యార్థులు వీక్షించే అవకాశం ఉంది. ఈసారి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కూడా ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తుందున దానికి అనుగుణంగా అభ్యాసాలను పొందుపరిచారు.
మారిన ఫస్ట్ ఇయర్ సిలబస్..
ఇంటర్ ప్రథమ సంవత్సరం సిలబస్ మారింది. కొత్త సిలబస్ ఆధారంగా పాఠ్య పుస్తకాలు ముద్రించారు. నూతన సిలబస్ కారణంగా పాఠ్య పుస్తకాల పంపిణీలో ఆలస్యం అవుతుందని ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు భావించారు. కానీ ఇంటర్ బోర్డు అధికారుల ప్రత్యేక చొరవతో కళాశాల ప్రాంభానికి ముందే పుస్తకాలను సిద్ధం చేశారు.
ప్రారంభం రోజే అందచేస్తాం
ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన పాఠ్య పుస్తకా లు జిల్లా కేంద్రానికి చేరా యి. నూతన విద్యా సంవత్సరం సోమవారం నుంచి ప్రారంభం అవుతుంది. మొదటి రోజు కళాశాలలకు వచ్చిన ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పుస్తకాలు అందిస్తాం. ప్రథమ సంవత్సరం ప్రవేశాలు కొనసాగుతున్నాయి. వారు రాగానే అందిస్తాం.
– పరశురామ్‌నాయక్, ఇంటర్ నోడల్ ఆఫీసర్


