లోడింగ్, అన్లోడింగ్ వేగవంతం చేయాలి
కలెక్టర్ భవేశ్ మిశ్రా
ఖానాపూర్, కడె మండలాల్లో
రైస్ మిల్లుల తనిఖీ
ఖానాపూర్/కడెం : ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా ఆదేశించారు. లోడింగ్, అన్లోడింగ్‌లో జాప్యం చేయకూడదని సూచించారు. ఖానాపూర్ మండలం సత్తనపల్లిలోని ఏఆర్‌ఎస్ రైస్ మిల్లును, కడెం మండలం నచ్చన్‌ఎల్లాపూర్, నవబ్‌పేట్, బెల్లాల్ రైస్‌మిల్లులను శుక్రవారం తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. మిల్లులో ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. నిల్వ సామర్థ్యం, ఇప్పటివరకు అన్‌లోడ్ చేసిన ధాన్యం వివరాలు, అందుబాటులో ఉన్న ఖాళీ స్థలం, రోజువారీ సగటు అన్‌లోడింగ్ సామర్థ్యం తదితర అంశాలపై అధికారులను, మిల్లు ని ర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మిల్లుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.
హమాలీల సంఖ్య పెంచాలి..
అన్‌లోడింగ్ ఆలస్యం కాకుండా హమాలీల సంఖ్య పెంచాలని మిల్లుల యజమానులకు సూచించారు. స్థానిక అధికారులు అన్‌లోడింగ్‌ను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. మిల్లుల తనిఖీ అనంతరం అధికా రులతో సమావేశమైన కలెక్టర్ కొనుగోలు కేంద్రాల వివరాలు, ఇప్పటివరకు సేకరించిన ధాన్యం, ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ము గింపు దశకు చేరుకున్న నేపథ్యంలో, మిగిలిన ప్రక్రియను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, పౌరసరఫరాల శాఖ అధి కారులు రాజేందర్, సుధాకర్, తహసీల్దార్లు సుజా త, మోయినుద్దీన్, ఎంపీడీవోలు రాధ, అరుణ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అటవీ ప్రాంత ప్రజలకు వసతులు కల్పించాలి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాల్లోని అటవీప్రాంత ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో టెలికాం సేవల మెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అటవీ, గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన ఇంటర్నెట్, రవాణా, పారిశుద్ధ్యం తదితర వసతులు కల్పించాలన్నారు. ప్రస్తుతం ప్రతీ అంశం ఇంటర్నెట్‌తో ముడిపడి ఉన్నందున, ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అటవీ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం ద్వారా ముఖ్య పట్టణాలకు అనుసంధానం పెరిగి మేలు కలుగుతుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్ కుమార్, డీఎఫ్‌వో సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఆర్డీవో రత్నకళ్యాణి, డీపీవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన పార్‌పల్లి రైతులు
లక్ష్మణచాంద: వరి ధాన్యం తరలించేలా చూడాలని మండలంలోని పార్‌పల్లి రైతులు శుక్రవారం కలెక్టర్ భవేశ్ మిశ్రాను కలిశారు. తూకం వేసిన ధాన్యం లారీలు రావడం లేదని ఉప సర్పంచ్ విద్యాసాగర్‌రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందచేశారు. లారీల కోసం ఫోన్ చేస్తే ఒక బస్తాకు రూ.30 అడుగుతున్నారని తెలిపారు. తమ గ్రామంలో ఇంకా 20 వేల బస్తాల ధాన్యం ఉందని పేర్కొన్నారు. స్పందించిన కలెక్టర్ పౌరసరపరాల శాఖ డీఎంతో ఫోన్‌లో మాట్లాడి పార్‌పల్లి గ్రామానికి లారీలు పంపి ధాన్యం తరలించాలని సూచించారు. వినతిపత్రం ఇచ్చినవారిలో రైతులు నర్సయ్య, గంగాధర్, గంగన్న, నారాయణ తదితరులు ఉన్నారు.


