జొన్న టోకెన్ల కోసం.. | - | Sakshi
Sakshi News home page

జొన్న టోకెన్ల కోసం..

May 31 2026 4:41 AM | Updated on May 31 2026 4:41 AM

లోకేశ్వరం: మండలంలోని పంచగుడి, లోకేశ్వరం, ధర్మోర, బాగాపూర్‌, రాయాపూర్‌కాండ్లీ, వట్టోలి, నగర్‌, పిప్రి గ్రామాలకు చెందిన రైతులు యాసంగిలో జొన్న పంటలను సాగు చేశారు. పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో జొన్న పంట కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంట విక్రయించేందుకు మండల కేంద్రంలోని రైతు వేదికలో టోకెన్లు ఇస్తున్నారు. సమాచారం తెలుసుకున్న రైతులు రైతువేదిక ముందు శుక్రవారం చెప్పులను క్యూలో ఉంచి బారులు తీరారు. ఎకరాకు పది క్వింటాళ్లు

విక్రయించేందుకు టోకెన్లు ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement