లక్ష్మణచాంద: మండలంలోని చామన్‌పల్లి గ్రా మంలోని డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం మూసివేశారు. 20 రోజుల క్రితం ప్రారంభించిన కొ నుగోళ్లు శుక్రవారం పూర్తయ్యాయి. గ్రామానికి చెందిన 433 మంది రైతుల నుంచి 51,250 బస్తాల ధాన్యం సేకరించారు. శుక్రవారం చివ రి లారీ తరలించారు. ఇప్పటి వరకు 202 మంది రైతులకు రూ.1,38,56,500 వారి ఖాతాల్లో జమ చేసినట్లు కేంద్రం నిర్వాహకులు తెలిపా రు. కలెక్టర్ భవేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, పౌర సరఫరాల శాఖ డీఎం సుధాకర్, పీఏసీఎస్ చైర్మన్ రఘునందన్‌రెడ్డికి నిర్వాహకులు రమణ, మహిపాల్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


