తానూరు: మండలంలోని జౌలా(కె) గ్రామంలో మద్య నిషేధం విధిస్తూ శనివారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. మద్యం, కల్తీ కల్లు కారణంగా యువత దారితప్పుతోంది, తాగుడుకు బానిసైనవారు కుటుంబాలను పట్టించుకోవ డం లేదని పంచాయతీ పాలకవర్గం మద్య నిషేధం విధించాలని నిర్ణయించింది. ఈమేర కు గ్రామసభలో తీర్మానం పెట్టగా మెజారిటీ గ్రామస్తుల చెయ్యి ఎత్తి నిషేధానికి మద్దతు తెలిపారు. దీంతో అందరి సహకారంతో గ్రా మంలో మద్యం పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం గ్రామంలో అభివృద్ధి పనులపై చర్చించారు. సమావేశంలో సర్పంచ్ ఇరేష్, పంచాయతీ కార్యదర్శి నగేశ్, ఉపసర్పంచ్ రాణి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


