అధ్యక్షా.. | - | Sakshi
Sakshi News home page

అధ్యక్షా..

May 31 2026 1:18 AM | Updated on May 31 2026 1:18 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక‘లో భాగంగా శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మహిళా వారోత్సవాలు, స్నేహ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల మాక్‌ పార్లమెంట్‌ ఆకట్టుకుంది. కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా మాక్‌ పార్లమెంట్‌ను స్వయంగా తిలకించారు. విద్యార్థులు ప్రధాన మంత్రి, స్పీకర్‌, ప్రతిపక్ష నాయకులు, కేంద్ర మంత్రుల పాత్రలను సమర్థవంతంగా నిర్వహించారు. మహిళల భద్రత, విద్య, సమాన హక్కుల సాధనపై సభలో జరిపిన చర్చ ఆకట్టుకుంది. అనంతరం కలెక్టర్‌ మాక్‌ పార్లమెంట్‌ కార్యక్రమంపై విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement