‘బీజేపీ యాత్ర రాజకీయ ప్రయోజనాల కోసమే’ | - | Sakshi
Sakshi News home page

‘బీజేపీ యాత్ర రాజకీయ ప్రయోజనాల కోసమే’

May 29 2026 2:13 AM | Updated on May 29 2026 2:13 AM

ఖానాపూర్‌: రైతు గోస పేరిట బీజేపీ చేపట్టిన యాత్ర రాజకీయ ప్రయోజనాల కోసమేనని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ ఆరోపించారు. గురువారం పట్ట ణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 56 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పరిమితి విధించినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 80లక్షల మెట్రిక్‌ టన్నులు చేసిందని చెప్పారు. రైతుల పండించిన చివరి ధాన్యం గింజాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. పంట అధికంగా పండినందున కొనుగోళ్లలో కొంత జాప్యం జరిగినా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే పెంబిలో అటవీ అనుమతుల కోసం ధర్నా చేస్తున్న బాధితులకు మద్దతివ్వాలని సూచించారు. నాయకులు పడిగెల భూషణ్‌, గాడ్పు సత్యం, చిన్నం సత్యం, అంకం రాజేందర్‌, జంగిలి శంకర్‌, గొర్రె గంగాధర్‌, రాజునాయ క్‌, కట్ట శ్యామ్‌, గంగనర్సయ్య, ప్రశాంత్‌రెడ్డి, జన్నారపు శంకర్‌, గుడాల రాజన్న, బొడ్డు గంగన్న, చంద్రశేఖర్‌, శ్రీకాంత్‌, శేషాద్రి, ఎనగంటి హరి, శ్రీహరి తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement