కడెం: కడెం–పెద్దూర్ గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్‌కుమార్, ఉప సర్పంచ్ పిట్టలరాజు అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటారు. మహారాష్ట్రకు చెందిన జవిలాల్ అనే వ్యక్తి కొంతకాలంగా మండల కేంద్రంలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈనెల 24న వడదెబ్బతో మృతిచెందడంతో పోలీసులు ఖానాపూర్ ప్రభుత్వాస్పత్రికి అతడి మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. అతని బంధువులెవరూ రాకపోవడంతో బుధవారం రాత్రి స్థానిక యువకులు ముభారక్, రాము, కిట్టు, హసీబ్, మోసిన్, గోవింద్ సాయంతో సర్పంచ్ అనాథ శవానికి సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. సర్పంచ్, స్థానిక యువకులను గ్రామస్తులు అభినందించారు.


